Reading Time: < 1 minute
Ap Film Corporation New Board Chairman Directors

ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్ , నాటకరంగ అభివృద్ధి సంస్థ నూతన బోర్డును ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ నియామకం కాగా, వైస్ చైర్మన్‌గా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరితో పాటు రెండేళ్ల కాలపరిమితితో నూతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం అఫీషియల్ జీవో విడుదల చేసింది.

ఈ నూతన బోర్డులో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు డైరెక్టర్లుగా అవకాశం లభించింది. ఇందులో ప్రముఖ సీనియర్ నటులు సుమన్, ఎస్. శివాజీ, టాలెంటెడ్ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, వివేక్ కూచిభొట్ల, నటి ఝాన్సీ , దర్శకుడు వి. సముద్ర సభ్యులుగా ఉన్నారు. అపార అనుభవం ఉన్న సినీ ప్రముఖులతో ఏర్పాటైన ఈ జంబో బోర్డు రాబోయే రెండేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌ల పెంపు, థియేటర్ల క్రమబద్ధీకరణ, నాటకరంగ కళాకారుల సంక్షేమం , చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కీలక వారధిగా పనిచేయనుంది.