Reading Time: < 1 minute

మాదాపూర్ లో భారీగా MDMA పట్టివేత.. డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్

Caption of Image.

హైదరాబాద్ సిటీలో జోరుగా  గంజాయి,  డ్రగ్స్ దందా సాగుతోంది.  ఇతర రాష్ట్రాలనుంచి గంజాయి, MDMA వంటి మత్తుపదార్థాలు  అక్రమంగా  రవాణా చేసి హైదరాబాద్ సిటీలో విక్రయిస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి డ్రగ్స్ విక్రయిస్తున్న వారి ఆటకట్టిస్తున్నప్పటికీ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ కొందరు కేటుగాళ్లు దందా చేస్తున్నారు .పోలీసుల కళ్లుగప్పి సిటీకి అక్రమంగా మత్తుపదార్థాలు తీసుకురావడం, స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ లక్ష్యంగా అక్రమ వ్యాపారం చేస్తున్నారు.  ఆదివారం (జూన్ 14) మాదాపూర్ లో  అక్రమంగా గంజాయి అమ్ముతున్న డ్రగ్ పెడ్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

మాదాపూర్ లోని చంద్రానాయక్ తం డాలోని ఓ అపార్టుమెంట్ లో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ , మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి మత్తుపదార్థాలు  విక్రయిస్తున్న ధనేకుల తరుణ్ తేజ్ (22) అనే యువకుడిని అరెస్టు చేశారు.  నిందితుడినుంచి 15 గ్రాముల MDMA, 38 గ్రాముల OG కుష్ గంజాయి, తొమ్మిది మొబైల్ ఫోన్లు, రెండు తూకం యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

►ALSO READ | వర్షం వస్తే అధికారులు రోడ్లపై ఉండాల్సిందే.. 

నిందితుడు  విజయవాడకు చెందిన కార్తీక్, పృథ్వీలనుంచి గంజాయి సేకరించి సిటీకి తీసుకొచ్చి స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ ఉద్యోగులను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతంకార్తీక్, పృథ్వీలు పరారీలో ఉన్నారు. 
నగరానికి వచ్చిన ఎనిమిది మంది వ్యక్తులు ఫ్లాట్‌లో గంజాయి సేవిస్తుండగా పట్టుబడ్డారని పోలీసులు కనుగొన్నారు. వారిపై చర్యలు ప్రారంభించబడుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.