Reading Time: < 1 minute
Minor Girl Assault Case Shocks West Godavari In Andhra Pradesh

AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.. పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన వెంకట గణేష్, బడేటి దుర్గ మహేష్, దేవరకొండ భోగేశ్వరరావు, ఆకుల లక్ష్మణ్ అనే నలుగురు యువకులు 2024 సంవత్సరం నుంచి బాలికను మోసం చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే, ఇటీవల బాలిక ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆమె తల్లిదండ్రులు భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక ఐదో నెల గర్భిణి అని నిర్ధారించారు. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు బాలికను నిలదీయగా జరిగిన ఘటన మొత్తాన్ని ఆమె వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనపై బాలిక తల్లి పాలకోడేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేయడంతో పాటు మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.