Reading Time: < 1 minute

Job News : కోల్ ఇండియాలో 660 ట్రైనీ ఉద్యోగాలు : జస్ట్ బీఈ/బీ.టెక్ పాస్ అయితే చాలు..!

Caption of Image.

కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: మేనేజ్మెంట్ ట్రైనీ (ఎంటీ).

మొత్తం ఖాళీలు: 660.

విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ 178, ఎలక్ట్రికల్ 221, మెకానికల్ 145, సిస్టమ్ (ఐటీ/ సీఎస్) 43, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ (ఈ & టీ) 38, జియాలజీ 15, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ 11, రాజభాష (హిందీ) 05, కంపెనీ సెక్రటరీ 19.

ఎలిజిబిలిటీ :  గుర్తింపు పొందిన యూనవర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం బీఈ/బి.టెక్, గ్రాడ్యుయేషన్, ఎంఎస్సీ/ ఎం.టెక్, ఎంఏ (హిందీ) పూర్తిచేసి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడ బ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడ బ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరి మితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 12.

లాస్ట్ డేట్: జూన్ 11.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌ సైట్coalindia.inను సందర్శించండి.

ఎగ్జామ్ ప్యాటర్న్: రాత పరీక్ష ఆన్ లైన్ పద్ధతిలో జరుగుతుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. ఇందులో మొత్తం రెండు విభాగాలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్/ అవేర్ నెస్/ రీజనింగ్/న్యుమరికల్ ఎబిలిటీ/ జనరల్ ఇంగ్లిష్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు, సంబంధిత సబ్జె క్టు నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.

©️ VIL Media Pvt Ltd.