Reading Time: < 1 minute

హంటా వైరస్ పై ఆందోళన వద్దు: డబ్ల్యూహెచ్‌‌‌‌ వో

Caption of Image.

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తున్న ‘హంటా వైరస్’ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌‌‌‌వో) వివరణ ఇచ్చింది. ఇది కోవిడ్ 19 తరహాలో విజృంభించే అవకాశం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. ఒక క్రూయిజ్ షిప్‌‌‌‌లో ఈ వైరస్ కేసులు బయటపడిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌‌‌‌వో ప్రతినిధులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

డబ్ల్యూహెచ్‌‌‌‌వో ఎపిడెమిక్ అండ్ పాండమిక్ మేనేజ్‌‌‌‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. ‘‘ఇది కోవిడ్ లేదా ఇన్‌‌‌‌ఫ్లుయెంజా లాంటిది కాదు. దీని వ్యాప్తి తీరు పూర్తిగా భిన్నం. ఇది కొత్తగా వచ్చిన వైరస్ కూడా కాదు.. చాలా కాలంగా ఉనికిలో ఉన్నదే. దీనివల్ల మరో కోవిడ్ లాంటి మహమ్మారి వస్తుందని భావించడం తప్పు’’అని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.