Reading Time: < 1 minute

TVK కేబినెట్లో చేరం.. డీఎంకేతోనే మా ప్రయాణం: సీపీఐ, సీపీఎం కీలక ప్రకటన

Caption of Image.

చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో.. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు తెలిపిన వామ పక్షాలు పవర్ షేరింగ్కు మాత్రం నో చెప్పాయి. టీవీకే కేబినెట్లో తాము చేరడం లేదని.. విజయ్ టీవీకే పార్టీకి బయట నుంచి తమ మద్దతు ఉంటుందని లెఫ్ట్ పార్టీలు స్పష్టం చేశాయి. డీఎంకేతోనే తమ ప్రయాణం కొనసాగుతుందని ప్రకటించాయి. మతతత్వ శక్తులను తరిమికొట్టే విషయంలో డీఎంకేతో కలిసి పోరాటం చేస్తామని.. తమిళనాడు హక్కులను కాపాడతామని లెఫ్ట్ పార్టీలు తెలిపాయి.

తమిళనాడులో గవర్నర్ పాలన పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతిచ్చామని లెఫ్ట్ పార్టీ నేతలు తెలిపారు. తమిళనాడులో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడటం అత్యవసరమని, అది కూడా మే 10లోగా ఏర్పడాలని లెఫ్ట్ పార్టీ నేతలు గుర్తు చేశారు. అలా జరగకపోతే.. గవర్నర్ పాలన విధించే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో.. తమిళనాడులో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటును కాంక్షిస్తూ జోసెఫ్ విజయ్ తమ మద్దతు కోరుతూ లేఖ పంపారని.. టీవీకే ముఖ్య నేతలు తమతో మాట్లాడారని లెఫ్ట్ పార్టీ నేతలు తెలిపారు.

డీఎంకే మిత్ర పక్షంగా ఉన్న వీసీకే మద్దతు తెలిపే విషయంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో టీవీకే పార్టీ ఐయూఎంఎల్ (IUML) మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ ఇద్దరు మద్దతు తెలిపితే విజయ్ సీఎం అవడం ఖాయం. అయితే.. IUML మాత్రం మద్దతు తెలిపే విషయంలో అంత ఆసక్తి కనబర్చడం లేదు. వీసీకే పార్టీ IUML మద్దతు కోసం ప్రయత్నించడం రెండోసారి కావడం గమనార్హం.

©️ VIL Media Pvt Ltd.