
స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇప్పుడు మార్మోగుతోంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించడంతో త్రిష పేరు కూడా సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఆమె నటించిన సినిమాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో త్రిష ఒకరు. సుమారు రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతోందీ అందాల తార. అయినా ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ అందం, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కాగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన త్రిష కేవలం ఒకే ఒక్క వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది. సుమారు రెండేళ్ల క్రితం వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీని షేక్ చేసింది. మూఢ నమ్మకాలు, అడవాళ్లు చిన్నారుల వరుస హత్యలు, వాటిని విచారించే నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ సుమారు 40 నిమిషాల నిడివి ఉంటుంది.
స్టోరీ విషయానికి వస్తే.. విధి నిర్వహణలో భాగంగా ఓ స్టేషనుకు బృంద ఎస్సైగా వెళుతుంది త్రిష. అయితే, అక్కడ ఆమెకు సరైన గుర్తింపు గానీ, గౌరవం గానీ లభించవు. పైగా ఇతర మేల్ ఆఫీసర్స్, పోలీసుల నుంచి అవమానాలు, ఛీత్కారాలు ఎదురవుతాయి. అయితే అదే సమయంలో స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 50 మంది ఆడవాళ్లు, చిన్న పిల్లలు కనిపించకుండా పోతారు? కట్ చేస్తే వారందరూ హత్యకు గురయ్యారని త్రిష తెలుసుకుంటుంది. మరి ఆ ఆడవాళ్లన ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
త్రిష నటించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు బృందా. సూర్య మనోజ్ వంగాలా తెరకెక్కించిన ఈ సిరీస్ లో ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
సోనీ లివ్ లో స్ట్రీమింగ్.. తెలుగులోనూ చూడొచ్చు..
Review – BRINDA [Web Series]
RATING – 4*/5
Streaming on – Sony Liv #BrindaReview – EXCELLENTSuccessfully shows both side of the coin, filled with goosebumps moments, thrilling, exciting, well made and well crafted web series, kudos to director #SuryaManojVangala… pic.twitter.com/D6o45X0fk8
— Rohit Jaiswal (@rohitjswl01) August 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
