Reading Time: < 1 minute
మమతా బెనర్జీ సర్కార్‌ను బర్తరఫ్‌ చేసిన గవర్నర్.. నెక్స్ట్ సీఎం ఎవరు..?

గవర్నర్‌ రవి బెంగాల్‌లో మమతా బెనర్జీ సర్కార్‌ను బర్తరఫ్‌ చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయడానికి మమత బెనర్జీ ఒప్పుకోకపోవడంతో గవర్నర్‌ గురువారం ఈ నిర్ణయం తీసుకున్నారు. మమతా రాజీనామా చేయకపోవడంతో గడువు ముగిసిన వెంటనే బెంగాల్‌ అసెంబ్లీని రద్దు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలిచామని, రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు మమత. ఎల్లుండి బెంగాల్‌లో తొలి బీజేపీ సర్కార్‌ కొలువు తీరుతుంది. ఉదయం 10 గంటలకు బ్రిగేడ్‌ గ్రౌండ్స్‌లో కొత్త సీఎం ప్రమాణం చేస్తారు. శుక్రవారం జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో సీఎంను ఎన్నుకుంటారు. అమిత్‌షా సమక్షంలో సీఎం ఎంపిక జరుగుతుంది.

బెంగాల్‌ సీఎం ఎవరన్న విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అయితే సీఎం రేసులో సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. భవానీపూర్‌లో మమతా బెనర్జీని ఓడించారు సువేందు అధికారి.. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు హాజరవుతారు. 5000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

బెంగాల్‌ సీఎం పదవి బెంగాలీకే దక్కుతుందని అమిత్‌షా స్పష్టం చేశారు. బెంగాలీ మీడియం చదువుకున్న వాళ్లనే సీఎం చేస్తామని స్పష్టంచేశారు. అయితే, ఈ అర్హతలు సువేందు అధికారికే మాత్రమే ఉన్నాయంటూ పేర్కొంటున్నారు..