కావాల్సిన పదార్థాలు : అరకిలో నాటుకోడి, ఒక కప్పు కరివేపాకు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, నూనెను తీసుకోవాలి.
కోడిని ఇలా మరిగించుకోవాలి: ముందుగా నాటుకోడిని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు వేసి వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో కోడి, కొద్దిగా నీరు తీసుకుని 5 విజిల్స్ వచ్చే వరకువాటిని బాగా ఉడికించాలి.
కరివేపాకు కొద్దిగా వేయించి బాగా చల్లారిన తర్వాత దీనిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ముందుగా వేపుడును ఇలా తయారు చేసుకోవాలి: పాన్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి బంగారు కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు దీనిని బాగా కలపాలి.
ముందుగా మసాలాలను కలుపుకోవాలి: అయితే, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇది బాగా ఉడికించిన తరవాత నాటుకోడి ముక్కలు కూడా దీనిలో వేసి బాగా వేయించాలి.
కరివేపాకు చివర్లో వేయాలి: చివర్లో మిక్సీ పట్టుకున్న కరివేపాకును కూడా దీనిలో వేసి 10 నిమిషాల పాటు సిమ్లో బాగా వేయించాలి. అయితే, నూనె పైకి తేలే వరకు స్టవ్ మీదే ఉంచండి. ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, అర కట్ట కొత్తిమీర కూడా స్టవ్ మీద నుంచి దించేయాలి. వేడి వేడిగా తింటే, ఇంకా రుచిగా ఉంటుంది.




