
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మండి (IIT Mandi) ప్రయాస్ 4.0 కింద నెల రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ (PRAYAS)ను సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (CCE) ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రకటన జారీ చేసింది. ఈ ప్రోగ్రామ్ జూలై 2026లో ఐఐటి మండి క్యాంపస్‌లో నిర్వహిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై విద్యార్ధులకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. మోటింగ్ అండ్ యాక్సిలరేటింగ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ స్టూడెంట్స్ (PRAYAS) అనేది అభ్యాసకులలో ప్రాథమిక, ఉన్నత నైపుణ్యాలను పెంపొందించడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమం విభిన్న విద్యా నేపథ్యాలు గల వారికి అందుబాటులో ఉంటుంది. అయితే అభ్యర్ధులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకున్నా ఈ ప్రోగ్రామ్‌లో చేరొచ్చు.
ఐఐటీ మండి (IIT Mandi) ప్రయాస్ 4.0కు దరఖాస్తు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఐఐటీ మండి ప్రయాస్ 4.0 ప్రోగ్రామ్ పాఠ్యప్రణాళిక ఎలా ఉంటుందంటే?
ఐఐటీ మండి ప్రయాస్ 4.0 ప్రోగ్రామ్ ఒక సమగ్రమైన విద్యా నిర్మాణం కలిగి ఉంటుంది. ఇందులో పాల్గొనేవారు అధ్యాపక బృందం ఆధ్వర్యంలో జరిగే రోజువారీ సెషన్లకు 5-6 గంటల పాటు హాజరుకావల్సి ఉంటుంది. థియరాటికల్ లెక్చర్స్, ల్యాబొరేటరీ వర్స్‌తో అనుసంధానించిన పాఠ్యప్రణాళిక ఉంటుంది. మొత్తం నాలుగు వారాల వ్యవధిలో ఈ ప్రోగ్రామ్ అందిస్తారు. అభ్యాసకులు ప్రాథమిక భావనల నుంచి అధునాతన అనువర్తనాల వరకు ఇందులో నేర్చుకోవచ్చు. ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాథమిక అంశాలు, సెన్సార్ టెక్నాలజీలు, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ వంటివి పాఠ్యప్రణాళికలో కీలక అంశాలు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఐఐటీ మండీ క్యాంపస్‌లోని అధునాతన ప్రయోగశాలలు,మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.
ఐఐటి మండి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఫీజులు ఎంతంటే?
ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ నెల పాటు కొనసాగుతుంది. ఈ కోర్సు చేసే వారికి క్యాంపస్‌లోనే వసతి, భోజన సౌకర్యాలు ఉంటాయి. ప్రోగ్రామ్ ఫీజు రూ. 62,400. జీఎస్టీ అదనంగా చెల్లించవల్సి ఉంటుంది. ఈ ఫీజులో ట్యూషన్, వసతి, భోజనం రుసుము కూడా కలిపి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు IIT మండి అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారికి ఐఐటీ మండిలోని సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్‌ను కూడా అందిస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.