Reading Time: < 1 minute
Toxic Movie Kiaraadvani Dismisses Rumors About Removing Bold Scenes

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం టాక్సిక్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన మరోసారి వాయిదా పడింది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలోని బోల్డ్ సీన్ల విషయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ తనపై చిత్రీకరించిన కొన్ని హాట్ సీన్స్ తొలగించాలని చిత్ర బృందాన్ని కోరినట్లు ప్రచారం జరిగింది.

 తనపై జరుగుతున్న ఈ ప్రచారంపై సదరు హీరోయిన్ తాజాగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కియారా స్పందిస్తూ ‘ టాక్సిక్ లో తన పాత్రకు సంబంధించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, అవన్నీ నిరాధారమైన పుకార్లే  సినిమా స్క్రిప్ట్ విషయంలో తాను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు, అలాగే ఈ సినిమాలో తనపై ఉండే కొన్ని హాట్ సీన్స్ తొలగించమని తాను కోరినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ ప్రచారాన్ని నమ్మవద్ద’ని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, కియారా అద్వానీ, హూమా ఖురేషి కథానాయికలుగా కనిపించనున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.