దళపతి విజయ్ ‘ది గోట్'(The Greatest Of All Time) సినిమాలోని ‘TN 07 CM 2026’ నెంబర్ ప్లేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా విజయ్ 2026 తమిళనాడుకు సీఎం అవుతానని ముందే ఫిక్స్ అయ్యారని.. అప్పుడే హింట్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..
‘ది గోట్'(The Greatest Of All Time).. 2024లో విడుదలైన ఈ మూవీలో దళపతి విజయ్ చివరిసారిగా కనిపించారు. ఆ తర్వాత ‘జననాయగన్’ సినిమా చేసినా ఇంకా అది రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ ‘ది గోట్’ సినిమాలోని ఓ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ మూవీలో విజయ్ వాడిన కారు నెంబర్ ప్లేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్. దానిపై రాసి ఉన్న ‘TN07CM2026’ నెంబర్‌ను ఇప్పుడు సోషల్ మీడియాలో దళపతి అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని.. సినిమా ద్వారా విజయ్ తన రాజకీయ ప్రణాళికను అభిమానులకు ముందే చేరవేశారని అంటున్నారు.
నెంబర్ ప్లేట్లో ఉన్న ‘TN 07’ విజయ్ నివసిస్తున్న నీలాంగరై ప్రాంతానికి చెందిన రిజిస్ట్రేషన్ కోడ్. తన సొంత ప్రాంతం నుంచే తన రాజకీయ ప్రయాణం మొదలు పెట్టాడు విజయ్. అలాగే ఆ నెంబర్ ప్లేట్లో ‘CM’, ‘2026’ ఉన్నాయి. అక్కడే దళపతి విజయ్ నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, తన లక్ష్యాన్ని ఈ సినిమా ద్వారా చెప్పకనే చెప్పారని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక నెంబర్ ప్లేట్ చివరలో ఉన్న ‘2026’ విజయ్ రాజకీయ భవిష్యత్తుకు కీలకమైన సంవత్సరం. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే విజయ్ ప్రధాన లక్ష్యం. దానికి తగ్గట్టుగా ఫిబ్రవరి 2024లో విజయ్ పార్టీని స్థాపించి.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టాడు. అలాగే ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్‌కు భిన్నంగా నేడు కౌంటింగ్‌లో విజయ్ టీవీకే పార్టీ 110 స్థానాల్లో గెలిచిన అతిపెద్ద పార్టీగా రికార్డు సృష్టించింది.
తమ నాయకుడు ఫిక్స్ అయ్యి మరీ.. అనుకున్నది చేసి చూపించాడని టీవీకే అభిమానులు నినాదాలతో హోరెత్తుతున్నారు. తన ఆశయానికి ప్రజల మద్దతు, పార్టీ కేడర్ సాయం చేశాయని.. అనుకున్నట్టుగానే ఇప్పుడు వచ్చిన లెక్కలు ప్రజలు తమిళనాడులో మార్పును కోరుకున్నారని.. దానికి తగ్గట్టుగా విజయ్ సీఎం అవుతున్నారని అన్నారు.




