Reading Time: 2 minutes
బరువుని తగ్గించే బ్రహ్మాండమైన గింజలు ఇవి.. డైలీ ఇలా చేస్తే గుట్టయినా ఇట్టే కరగాల్సిందే..

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలో చియా సీడ్స్ అనేవి ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన గింజలుగా గుర్తించబడుతున్నాయి. ప్రకృతిలో లభించే ఈ గింజలు కేవలం తక్కువ ధరలో లభించడమే కాకుండా, బాదం, జీడిపప్పు వంటి ఇతర ఖరీదైన గింజల కంటే కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే.. బరువుతగ్గాలనుకున్న వారు.. అలాగే.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలనుకున్న వారు.. చీయా సీడ్స్ ను తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చియా సీడ్స్ మన ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయో వివరంగా తెలుసుకుందాం..

పోషక విలువలు:

  • 100 గ్రాముల చియా సీడ్స్‌లో ఉండే పోషకాలు.
  • శక్తి: 486 కిలో క్యాలరీలు
  • కార్బోహైడ్రేట్లు: 42 గ్రాములు
  • ప్రొటీన్: 16 గ్రాములు
  • కొవ్వులు: 30 గ్రాములు
  • పీచు పదార్థం (ఫైబర్): 34 గ్రాములు

సూక్ష్మ పోషకాలు:

  • కాల్షియం: 630 మిల్లీగ్రాములు
  • మెగ్నీషియం: 335 మిల్లీగ్రాములు
  • పొటాషియం: 407 మిల్లీగ్రాములు
  • ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్: 17.8 గ్రాములు (సుమారు 18 గ్రాములు)

ఆరోగ్య ప్రయోజనాలు:

గుండె ఆరోగ్యం – మెదడు పనితీరుకు: చియా సీడ్స్‌లో అత్యధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండె జబ్బులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతాయి. అంతేకాకుండా, మెదడు పనితీరును మెరుగుపరిచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి సమస్యలను నివారించడంలో కూడా ఒమేగా-3 సహాయపడుతుంది. చేపలతో పోలిస్తే, చియా సీడ్స్‌లో ఒమేగా-3 అనేక రెట్లు అధికంగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. రోజుకు 1.6 గ్రాముల ఒమేగా-3 శరీరానికి అవసరం కాగా, 100 గ్రాముల చియా సీడ్స్ 18 గ్రాముల ఒమేగా-3ని అందిస్తాయి.

జీర్ణక్రియ మెరుగుదల – మలబద్ధకం నివారణ: చియా సీడ్స్‌లో పీచు పదార్థం (ఫైబర్) చాలా అధికంగా ఉంటుంది. 100 గ్రాముల చియా సీడ్స్ ద్వారా ఒక రోజుకు కావాల్సిన 35 గ్రాముల ఫైబర్‌లో దాదాపు 34 గ్రాములు లభిస్తుంది. ఈ అధిక ఫైబర్ మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ప్రేగులను శుభ్రపరచి, ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది. ఇది కొవ్వుల శోషణను తగ్గించి, చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

ఎముకల బలం: చియా సీడ్స్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది (100 గ్రాములకు 630 మిల్లీగ్రాములు). ఇది పాల కంటే ఐదు రెట్లు ఎక్కువ. కాల్షియంతో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఎముకల గుల్లబారడం (బోన్ ఆస్టియోపొరోసిస్) వంటి సమస్యలను నివారించడంలో, ఎముక కణజాలం వృద్ధి చెందడంలో చియా సీడ్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. వృద్ధులు, పెరుగుతున్న పిల్లలకు ఇవి ఎంతో అవసరం..

ప్రొటీన్ లోపాన్ని నివారించడానికి: చియా సీడ్స్‌లో 16 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణమై, శరీరానికి త్వరగా అందుతుంది. ఇతర ప్రొటీన్ వనరుల మాదిరిగా ఇవి గ్యాస్ లేదా అజీర్ణాన్ని కలిగించవు. అందువల్ల, వృద్ధులకు, జీర్ణ సమస్యలు ఉన్నవారికి, ప్రొటీన్ లోపంతో బాధపడుతున్న వారికి చియా సీడ్స్ ఒక అద్భుతమైన ప్రొటీన్ మూలం..

మధుమేహం నియంత్రణ: టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి చియా సీడ్స్ చాలా మంచివి. ఇందులో అధిక పీచు, కొవ్వులు, ప్రొటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. చియా సీడ్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించి, ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని అర్జెంటీనా దేశం 2009లో ఎలుకల పైన చేసిన పరిశోధనలు నిరూపించాయి. అంతేకాకుండా, డయాబెటిస్ కారణంగా శరీరంలో ఏర్పడే మంటను (ఇన్ఫ్లమేషన్) తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. 2007లో టొరాంటో, కెనడాలో జరిగిన ఒక అధ్యయనంలో, చియా సీడ్స్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ రోగులలో ఇన్ఫ్లమేషన్ 40% తగ్గిందని తేలింది.

చియా సీడ్స్ వినియోగం:

చియా సీడ్స్ చాలా సులభంగా జీర్ణం అవుతాయి. సబ్జా గింజల మాదిరిగానే వీటిని కూడా నీటిలో 10-15 నిమిషాల నుండి ఒక గంట వరకు నానబెట్టి తీసుకోవచ్చు. నానబెట్టిన చియా సీడ్స్‌ను పండ్లతో, పండ్ల సలాడ్స్‌తో, కూరగాయల సలాడ్స్‌తో పాటు తీసుకోవచ్చు. జ్యూసుల్లో కలుపుకోవచ్చు లేదా దోరగా వేయించి పొడి చేసి వంటల్లో చల్లుకోవచ్చు. ముసలివారు, చిన్న పిల్లలు కూడా వీటిని సులువుగా తినవచ్చు.

చియా సీడ్స్ కేవలం పోషకాల గని మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకు సహజమైన పరిష్కారం కూడా. మీ రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా గుండె, ఎముకలు, జీర్ణక్రియ, మధుమేహం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సందేహాలున్నా.. అనారోగ్య సమస్యలున్న ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం ముఖ్యం..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..