Reading Time: < 1 minute
మండే వేసవిలో చలవ చేసే సమ్మర్ స్పెషల్ డ్రింక్స్.. తాగారో బాడీ అంతా కూల్.. కూల్..

వేసవి కాలం వచ్చేసింది! బయట ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మనందరికీ ఏదైనా చల్లగా, రిఫ్రెష్‌గా తాగాలనిపిస్తుంది. సాధారణంగా మనం కూల్ డ్రింక్స్ వైపు వెళ్తాం కానీ, అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందుకే మన ఇంట్లోనే ఉండే సహజమైన వస్తువులతో, ముఖ్యంగా ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యం, సబ్జా గింజలతో రెండు రకాల స్పెషల్ డ్రింక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..

మొదటిది ‘కర్బూజా సగ్గుబియ్యం జ్యూస్’. ఇది శరీరంలోని వేడిని తగ్గించడమే కాకుండా మంచి ఎనర్జీని ఇస్తుంది. దీనికోసం ముందుగా సన్నటి సగ్గుబియ్యాన్ని నానబెట్టి, పాలలో మిల్క్ పౌడర్ కలిపి ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక, అందులో మిక్సీ పట్టిన కర్బూజా రసాన్ని(బెల్లం లేదా పంచదారతో కలిపి) కలపాలి. చివరగా నానబెట్టుకున్న సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్యూబ్స్ వేస్తే ఎంతో క్రీమీగా ఉండే కర్బూజా షర్బత్ రెడీ.

రెండవది ‘రోజ్ సాబుదానా జెల్లీ డ్రింక్’. ఇది చూడటానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో, తాగడానికి అంత రుచిగా ఉంటుంది. దీనికోసం ఇన్స్టంట్ జెల్లీని తయారు చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉడికించిన సగ్గుబియ్యంలో పాలు, రోజ్ సిరప్, కండెన్స్డ్ మిల్క్ కలిపి చిక్కగా చేసుకోవాలి. ఇది ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తర్వాత, గ్లాసులో ఐస్ క్యూబ్స్, జెల్లీ ముక్కలు, సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసి సర్వ్ చేయాలి. ఈ రెండు డ్రింక్స్ కూడా గెస్ట్స్ వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి.

ఇది చదవండి: వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఇక చిటికలో పని.. లోపలికి దిగకుండానే ఈజీగా శుభ్రం చేయండిలా.!