
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో భైరవ పాత్రలోని కర్ణుడి కోణాన్ని ఆవిష్కరించడంతో, సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నిర్మాత అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ గురించి ఒక అదిరిపోయే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
Also Read :Chitti Babu: ప్రముఖ నటుడు, దర్శకుడు చిట్టిబాబు కన్నుమూత!
‘కల్కి 2’ కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను నిర్మిస్తోందట. ఈ సెట్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచే ఇంటర్వెల్ బ్లాక్ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అత్యంత కీలకమైన ఈ సన్నివేశంలో ప్రభాస్‌తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), లోకనాయకుడు కమల్ హాసన్ (సుప్రీమ్ యాస్కిన్) కూడా పాల్గొంటారట. ముగ్గురు దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే ఈ ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. సీక్వెల్‌కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏమిటంటే..
దీనికి ‘కర్ణ 3102 బీసీ’ (Karna 3102 BC) అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు టాక్. మొదటి భాగంలో కల్కి ఆగమనం గురించి చెబితే, రెండో భాగంలో కర్ణుడి పునరాగమనం, ద్వాపర యుగంలోని కీలక ఘట్టాలను ఎక్కువగా చూపించబోతున్నారట. సీక్వెల్‌లో మైథాలజీ లెంగ్త్ మొదటి భాగం కంటే చాలా ఎక్కువగా ఉంటుందని, కథ మొత్తం కర్ణుడి పాత్ర చుట్టూనే తిరుగుతుందని సమాచారం.