కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు బియ్యం, మినప్పప్పు, అర కప్పు పచ్చిశనగ పప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ , కొత్తిమీర తగినంత, కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, నూనెను తీసుకోవాలి.
ఇప్పుడు ముందుగా మినప్పప్పు, శనగపప్పు, బియ్యం బాగా కడిగి 4 నుంచి 6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నీటిని బాగా వడపోసి, మిక్సీ లేదా రోటిలో జోరు పిండిలాగా బాగా రుబ్బుకోవాలి.
ఇంకా దీనిలో కొద్దిగా నీటిని కూడా పోయాలి. ఇక ఇప్పుడు పిండిని తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో ఉల్లిపాయ ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు , కొద్దిగా కొత్తిమీర, నాలుగు కరివేపాకు, ఉప్పును వేసి కలపాలి.
ఆ తర్వాత పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
ఇవి బంగారు రంగులోకి మారే వరకూ మీడియం మంట పై వేయించుకోవాలి. కాలిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. వేడి వేడి పునుగులు రెడీ. వీటిని అల్లం పచ్చడి రెడీ.. టేస్టీ పునుగులు రెడీ.




