కావాల్సిన పదార్థాలు : 200 గ్రాముల మటన్, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, రెండు చిన్న దోసకాయలు , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , పసుపు, అర టీ స్పూన్ మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి.
ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగారు కలర్ వచ్చే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా వేయించుకోవాలి.
ఇక కొద్దీ సేపటి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేయాలి. 15 నిమిషాలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి
మటన్ ముక్కలు మెత్తగా అయిన తర్వాత ఓక కప్పు దోసకాయ ముక్కలు వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీనిని అలాగే, స్టవ్ మీదే ఉంచి 15 నిముషాల పాటు ఉంచి ఉడకనివ్వాలి
చివర్లో ఒక టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడులు వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా గ్రేవీ కావాలనుకునే వారు రెండు గ్లాసుల నీళ్ళు పోసి 10 నిముషాలు పాటు పొయ్యి మీదే ఉంచి ఉడికించాలి. చివర్లో కొత్తిమీరను చల్లి కిందకు దించేసి వేడి వేడి అన్నంలో తినడమే.




