
తనను ముట్టుకోవాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని ఫస్ట్‌నైట్ రోజు భర్తను పెళ్లి కూతురు డిమాండ్ చేసిన ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని జగదీష్‌పురకు చెందిన యువకుడికి, హత్రాస్ ప్రాంతానికి చెందిన యువతితో ఇటీవలే ఇరు కుటుంబాల అంగీకారంతో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగియగానే ఫస్ట్‌నైట్‌కు రెడీ చేశారు కుటుంబ సభ్యులు. ఇక ఆత్రుతగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన పెళ్లి కొడుకు వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తనను ముట్టుకోవాలంటే తను రూ. 90 లక్షలు ఇవ్వాలి షరతు పెట్టింది. అది విన్న పెళ్లి కొడుకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంత డబ్బు ఇవ్వడం సాధ్యం కాదని, అసలు డబ్బు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించాడు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెళ్లి కూతురు వరుడితో గొడవకు దిగింది. గదిలోంచి గొడవ పడుతున్న శబ్ధాలు రావడంతో కుటుంబ సభ్యులంతా అక్కడి చేరుకున్నారు. దీంతో జరిగిన విషయాన్ని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.వారంతా ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె అస్సలు తగ్గలేదు. పైగా తన పుట్టింటి వారికి ఫోన్ చేసి, వరుడి కుటుంబ సభ్యులపై దాడి చేయమని ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఫిర్యాదులో వరుడి కుటుంబ సభ్యులు ఇలా పేర్కొన్నారు.. ఆమె భర్తను, అతని కుటుంబ సభ్యులను గదిలో వేసి లాక్ చేసిందని, తర్వాత గ్యాస్ సిలిండర్ పైపును తొలగించి అందరినీ చంపేయడానికి కూడా ప్రయత్నించిందని ఆరోపించారు. అయితే మొదట్లో కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో వరుడి కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో ఘటనపై విచారణ జరిపిన కోర్టు ఘటనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో పెళ్లి కూతురికి మొత్తం నిజాలు బయటపెట్టింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కేవలం డబ్బు కోసమే వివాహానికి ఒప్పుకున్నానని ఆమె నిర్మొహమాటంగా అంగీకరించింది. దీంతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులకు అదుపులోకి తీసుకొని మరింత సమాచారం రాబడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.