ఒకప్పుడు వరస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేసింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించేసింది.అలాగే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అందం, అభినయంతో నెట్టింట సందడి చేస్తుంది.
ఈ చిన్నది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ.
టాలీవుడ్ లో స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఈ బ్యూటీ బాలీవుడ్ చక్కేసిది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. ఆతర్వాత పెద్దగా అక్కడ కూడా అవకాశాలు అందుకోలేకపోయింది.
ఇటు తెలుగులోనూ అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్లో అడపాదడపా సినిమాలు, వెబ్ సీరీస్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. బాలీవుడ్ నిర్మాతను వివాహం చేసుకున్న తర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు చాలా వరకు తగ్గాయి.
దీంతో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, బిజినెస్లు చూస్తూ గడిపేస్తుంది. ఇక ఏమాత్రం సమయం దొరికినా సరే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ, తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ క్యూట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.




