వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో మరో మూడు గ్రహాలతో ఉన్న చంద్రుడు అనేక మార్గాల్లో ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరగడం, పదోన్నతులు కలగడం, ఆరోగ్యం మెరుగుపడడం వంటివి జరుగుతాయి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సత్ఫలితాలనిస్తుంది. ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం వృద్దిచెందుతాయి. ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
మిథునం: ఐశ్వర్య కారకుడైన చంద్రుడు దశమంలో అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఎలాంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. కొత్త లక్ష్యాలు సాధించడానికి, వృత్తి, వ్యాపారాలు సవ్యంగా సాగడానికి సమయం అనుకూలంగా ఉంది.
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల బంధుమిత్రుల నుంచే కాక, తెలియని వ్యక్తుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన ఉద్యోగ సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది.
కన్య:ఈ రాశికి లాభాధిపతి అయిన చంద్రుడు మిత్ర క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేస్తున్నందువల్ల, ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఇది అన్ని విధాలుగానూ అనుకూల సమయం. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.
వృశ్చికం: పంచమ స్థానంలో చంద్రుడు మరో మూడు గ్రహాలతో యుతి చెందడం వల్ల ఉద్యోగంలో జీత భత్యాలు పెరగడం, అధికార యోగం పట్టడం వంటివి జరుగుతాయి. నైపుణ్యాలు వృద్ది చెందుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని విధంగా యాక్టివిటీ పెరుగుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా సత్ఫలితాలనిస్తుంది.
మీనం: ఈ రాశిలో చంద్రుడు మూడు గ్రహాలతో కలవడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా పురోగతి చెందడంతో పాటు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధి లోకి వస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో విభేదాలు పరిష్కారమవుతాయి. మీ ఆలోచనలకు, నిర్ణయాలకు విలువ ఏర్పడుతుంది. పుణ్య క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది.





