Reading Time: < 1 minute
AP Inter Supplementary Exams 2026: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి టైం టేబుల్‌ ఇదే

అమరావతి, ఏప్రిల్ 15: ఏపీ ఇంటర్ 2026 సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్‌ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్‌ సెషన్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. ఇక ఫెయిలైన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే వారికి ఇంటర్ ప్రాక్టిలక్‌ పరీక్షలు జూన్‌ 7, 2026వ తేదీ నుంచి జూన్‌ 11, 2026వ తేదీ వరకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు.

ఏపీ ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు మాత్రమే ఇంప్రూవ్‌మెంట్ ఫెసిలిటీ ఉంటుంది. సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులు ఎవరైనా ప్రాక్టికల్స్, సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్ రాయాలంటే తొలుత సాధించిన మార్కులను రద్దు చేసుకోవల్సి ఉంటుంది. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్స్యూయ్‌ పరీక్షను జూన్‌ 5, 2026వ తేదీన, ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జూన్‌ 6వ తేదీన నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలతోపాటు ఇంప్రూవ్‌మెంట్, రీ వెరిఫికేషన్‌ కోసం ఫీజు చెల్లింపులు ఏప్రిల్ 20, 2026వ తేదీ న ఉంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. విద్యార్దులు ఈ వారం రోజుల వ్యవధిలో ఫీజులు చెల్లించాలి.

ఇంటర్ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ తేదీలు

ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలితాల్లో విద్యార్ధులకు ఎవరైనా సందేహాలు ఉంటే రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.