Reading Time: < 1 minute
Nani The Paradise Movie Release Date Postponed August To December

నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ది ప్యారడైజ్. ‘దసరా’ వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే, ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఫ్యాన్స్‌ను గందరగోళంలో పడేస్తోంది.

 Also Read : Exclusive : పెద్ది పోస్ట్ పోన్.. ఓటీటీ డీల్ పై కోత పెట్టిన నెట్ ఫ్లిక్స్

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ‘ది ప్యారడైజ్’ ఈ ఏడాది ఆగస్ట్ 27న గ్రాండ్‌గా విడుదల కావాలి. కానీ గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఆగస్ట్‌లో రావడం లేదని  నేరుగా డిసెంబర్‌కు వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అవేవీ నిజం కావని అనుకున్న సమయానికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్. చిత్ర బృందం ఆగస్ట్ రిలీజ్ అని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందనే  టాక్ కూడా మరోవైపు వినిపిస్తోంది; .   సినిమా షూటింగ్ జరుగుతున్న తీరు  విజువల్ ఎఫెక్ట్స్ పనులు మరియు భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణకు పట్టే సమయాన్ని బట్టి చూస్తే.. ఆగస్ట్ 27 నాటికి సినిమా పూర్తి కావడం దాదాపు అసాధ్యమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. క్వాలిటీ  విషయంలో రాజీ పడకూడదని శ్రీకాంత్ ఓదెల భావిస్తుండటంతో షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఫలితంగా డిసెంబర్ బరిలోకి దిగుతారని టాక్. నాని గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడంతో ‘ది ప్యారడైజ్’ ఒకవేళ ఆగస్ట్ నుండి డిసెంబర్‌కు మారితే అది క్రిస్మస్ సెలవులను క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి చిత్ర యూనిట్ అధికారికంగా ఈ వాయిదాపై ఎప్పుడు స్పందిస్తుందో వేచి చూడాలి.