
Tamil Nadu: ప్రస్తుతం టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ వార్త వైరల్ అవుతోంది. అదే తమిళనాడులో తొమ్మిది మంది పోలీసులకు ఉరి శిక్ష విధించిన వార్త. సాత్తాన్‌కుళం లాకప్ డేత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తండ్రి కొడుకులను లాకప్‌లో చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో 9 మంది పోలీస్ అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే.. ఈ సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది తోటి పోలీసులకు ఉరి శిక్ష పడటానికి ప్రధాన కారణం హెడ్ కానిస్టేబుల్ రేవతి. ఈ లాకప్ మరణాలు బయటకు తెచ్చిన కీలక సూత్రదారి రేవతి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇది బయకు పొక్కకూడదని పోలీసులు అందరూ మాట్లాడుకున్నారు. సాక్ష్యాలను తుడిచేయాలి, కథను మార్చేశారు. ఇలాంటి సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్‌గా ఉండటాన్నే సేఫ్‌గా భావిస్తారు. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు. కేవలం డ్యూటీ మాత్రమే చేయాలని కాకుండా తన కళ్లముందు జరిగిన దారుణానికి స్పందించాలని తన హృదయం పరితపించింది.
READ MORE: RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!
ఒకవైపు తొటి సిబ్బంది ఒత్తిడి, మరోవైపు ఉన్నతాధికారులు ఆంక్షల మధ్య ఈ విషయాన్ని బయటకు తీసుకురావాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని రేవతి భీష్మించుకుంది. ఆమె మేజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కేసు దిశనే మార్చింది. రేవతి కేవలం ఒక స్టేట్మెంట్ కాదు.. ఆ రాత్రి జరిగిన వాస్తవాన్ని కళ్ల ఎదుటే చూయించింది. పోలీసులు స్టేషన్‌ను శుభ్రం చేసి సాక్ష్యాలను తుడిచివేసినా, ఆమె అత్యంత చాకచక్యంగా గోడల మూలల్లో టేబుళ్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను గుర్తించి మేజిస్ట్రేట్‌కు చూపించింది. ఈ రక్తపు చుక్కలే నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో ప్రధాన భూమిక పోషించాయి. సీసీటీవీ ఫుటేజీని మాయం చేసినా, ఆమె తన జ్ఞాపకశక్తితో సంఘటనలు జరిగిన సమయాలను పూసగుచ్చినట్లు వివరించి దర్యాప్తునకు దిక్సూచిలా నిలిచింది. ఇది సాధారణ విషయం కాదు. పోలీసుగా విధులు నిర్వర్తిస్తూ పోలీసులకే వ్యతిరేకంగా శిక్షపడేలా చేసింది. చివరికి బాధితులకు న్యాయం జరిగేలా చేసింది.ఇలాంటి పోలీసులను అభినందించక తప్పదు. “పోలీసమ్మ నీకు సెల్యూట్”.