
ఇరాన్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలంతా ఒక్కొక్కరిగా నేలరాలిపోతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దగ్గర నుంచి ఆయన కుడి భుజం, ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ వరకు టాప్ మోస్ట్ లీడర్లంతా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో టాప్ లీడర్లందరినీ హతమార్చుతోంది. తాజాగా మరో కీలక నేతను అంతమొందించినట్లుగా ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌పై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ నేవీ కమాండర్ అలిరెజా తంగ్సిరి ప్రాణాలు తీసింది. ప్రస్తుతం హార్ముజ్ దిగ్బంధనాన్ని అలిరెజా తంగ్సిరినే పర్యవేక్షిస్తున్నాడు. హార్ముజ్ జలసంధి మూసివేతకు అలీరెజానే కారణమని నివేదికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలిరెజాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుని చంపేసింది. అలిరెజా హతం అయినట్లుగా ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది.
బందర్ అబ్బాస్‌లో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళ కమాండర్ అలీరెజా తంగ్సిరి మరణించినట్లు ఒక ఇజ్రాయెల్ అధికారి పేర్కొన్నట్లుగా ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం.. హార్ముజ్ జలసంధి మూసివేతకు తంగ్సిరియే బాధ్యుడని పేర్కొంది. అయితే ఈ దాడిపై ఇరాన్ గానీ.. ఇజ్రాయెల్ సైన్యం గానీ ఇంకా అధికారింగా వెల్లడించలేదు.