July 12, 2026

PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ

PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ
Reading Time: < 1 minute
Pm Narendra Modi Ugadi 2026 Wishes Telugu People Message

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు రాకను, కొత్త ఆరంభాల స్ఫూర్తిని జరుపుకుంటూ ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. తెలుగు ప్రజల పండుగ ఉగాది సందర్భంగా ప్రధానమంత్రి తెలుగు భాషలో ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని కోరుకున్నారు.

READ ALSO: JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..

ఈ సందర్భంగా ప్రధాని తన పోస్ట్‌లో ఈవిధంగా రాసుకొచ్చారు.. ‘పవిత్ర, శుభపద్రమైన ఉగాది పండుగ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వసంత రుతువు మన చుట్టూ ఆనందాన్ని, ఉల్లాసాన్ని పంచే అందమైన కాలమిది. కొత్తగా వికసించే పూల పరిమళం, ఈ కాలంలో లభించే పండ్ల ఆగమనం కొత్త శక్తికి, అవకాశాల స్ఫూర్తికి సంకేతంగా నిలుస్తాయి. కష్టజీవులైన మన రైతన్నలు గొప్ప ఆశావాదంతో తదుపరి వ్యవసాయ చక్రానికి సిద్ధమయ్యే సమయం కూడా ఇదే. జీవితంలోని అన్ని రుచులనూ స్వీకరించాలని గుర్తుచేసే సంప్రదాయ ఉత్సవం ఉగాది. అనేక సంస్కృతుల్లో వివిధ వంటకాలతో పాటు తీపి, చేదు రుచులు కలగలిసిన వంటకాలను తయారుచేసే సంప్రదాయం ఈ పండుగ రోజు ఉంది. ఇది జీవితానికి ఉండే లోతైన అర్థాన్ని తెలియజేయడంతో పాటు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా, విజయాన్ని కృతజ్ఞతతో స్వీకరించేలా మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీరు తలపెట్టే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించి, శాంతి, సానుకూలతను పంచాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

READ ALSO: Anil Sunkara: అనిల్ సుంకర సరికొత్త ప్రయోగం.. ‘ఎయిర్‌ఫోర్స్–బెజవాడ బ్యాచ్’ స్టార్ట్