వంట గ్యాస్ కొరత లేదు : కలెక్టర్లు అనురాగ్ జయంతిCaption of Image.
యాదాద్రి/ మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: యాదాద్రి, మహబూబ్నగర్ జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మి వినియోగదారులు ఆందోళన చెందవద్దని ఆయా జిల్లా కలెక్టర్లు అనురాగ్ జయంతి, కుష్బూ గుప్తా తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ బుకింగ్ చేసినా గ్యాస్ రాకుంటే వెంటనే సంబంధిత ఆఫీసర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనవసరంగా గ్యాస్ బుకింగ్చేయవద్దన్నారు.