Reading Time: < 1 minute

వ్యవసాయ బావి పూడిక తీస్తుండగా..క్రేన్ తెగిపడి ముగ్గురు మృతి

Caption of Image.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాలలో ఘోర ప్రమాదం జరిగింది.  వ్యవసాయ బావిపూడిక తీస్తూ ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు.  బావిలోపల మట్టి తొలగిస్తుండగా  ప్రమాదవశాత్తు క్రేన్ తెగిపడిపోవడంతో  క్రేన్ తో సహా నలుగురు వ్యవసాయ బావిలో పడిపోయారు. ఈ ఘటనలో  ము గ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. 

 ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  స్థానికుల సహాయంతో మృతదేహాలను బావిలో నుంచి బయటకు  తీశారు. గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.   మృతులు  కొరికిశాల గ్రామానికి చెందిన సుకిన దేవారావు(48), బండారి అభిలాష్(16). పిడిసిల్ల గ్రామానికి చెందిన సరిగోమ్ముల(53) గా గుర్తించారు. 

►ALSO READ | హైదరాబాద్ పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు..బావిలో కుళ్లిపోయి ఇలా..అసలేం జరిగింది.?

పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ముగ్గురి మృతితో ఆ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పొట్ట కూటి కోసం పూడిక పనులుకు వెళ్లిన కూలీలు మృతి చెందడంతో ఆ కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.