Reading Time: < 1 minute
India Set Huge Target Of 254 Runs For England

T20 వరల్డ్ కప్ 2026 రెండవ సెమీ-ఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 07 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కు 254 పరుగుల భారీ టార్గెట్ ను నిర్ధేశించింది. సంజు సామ్సన్ , అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అభిషేక్ మంచి ఫామ్‌లో ఉన్నట్లు కనిపించాడు. కానీ 9 పరుగులకే విల్ జాక్స్ చేతిలో ఔటయ్యాడు. ఆ తర్వాత సంజు, ఇషాన్ జాగ్రత్తగా ఆడి పవర్‌ప్లేలో (6 ఓవర్లు) స్కోరును 67/1కి తీసుకెళ్లారు. పవర్‌ప్లే ముగిసిన వెంటనే, సంజు 26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ 8.3 ఓవర్లలో 100 పరుగులు సాధించింది, ఇది T20 ప్రపంచ కప్ నాకౌట్‌లో ఒక జట్టు చేసిన రెండవ వేగవంతమైన స్కోరు, నిన్న (మార్చి 4) దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 7.5 ఓవర్లలో 100 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Also Read:Sanju Samson: ఇంగ్లీష్ బౌలర్లను వేటాడేసిన సంజు శాంసన్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్.. రోహిత్ శర్మ రికార్డు సమం

ఇషాన్ కిషన్ (39) మంచి ఫామ్‌లో కనిపించాడు, కానీ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో పెద్ద షాట్‌కు దిగాడు. విల్ జాక్స్ లాంగ్-ఆఫ్‌లో అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఇషాన్ అవుట్ కావడంతో భారత స్కోరు 117/2కి తగ్గింది. ఆ తర్వాత సంజు దుబేతో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. కానీ విల్ జాక్స్ వేసిన బంతిని సంజు ఇన్సైడ్-అవుట్ షాట్ కోసం కొట్టాడు. సామ్సన్ 42 బంతుల్లో 89 పరుగులు చేసి సెంచరీ మిస్ అయ్యాడు. సంజు అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ఆదిల్ రషీద్ అవుట్ చేశాడు. శివమ్ దూబే రనౌట్ అయ్యాడు. 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు. నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. ఆరో వికెట్ తిలక్ వర్మ రూపంలో పడిపోయింది. 7 బంతుల్లో 03 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. ఏడవ వికెట్ హార్దిక్ పాండ్యా 27 పరుగులు చేశాడు.