Reading Time: < 1 minute
Bellamkonda Sai Sreenivas Engagement And Wedding Updates

టాలీవుడ్ మాస్ అండ్ యాక్షన్ హీరో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని సమాచారం. గత కొద్ది రోజులుగా ఈ యంగ్ హీరో పెళ్లి గురించి ఫిల్మ్ నగర్లో రకరకాల చర్చలు నడుస్తుండగా.. తాజాగా ఆయన నిశ్చితార్థం ఈ వారంలోనే జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నారు. రీసెంట్‌గా ‘కిష్కింధపురి’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. వరుస ప్రాజెక్టులతో కెరీర్ గ్రాఫ్ పెరుగుతున్న తరుణంలోనే, వ్యక్తిగత జీవితంలోనూ ఈ శుభవార్త రావడం విశేషం.

READ ALSO: Modi-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు మోడీ ఫోన్.. యుద్ధంపై సంభాషణ

సాయి శ్రీనివాస్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఆమె సినీ రంగానికి చెందినవారా లేక కుటుంబ సభ్యులు నిశ్చయించిన సంబంధమా? అనే విషయాలను ప్రస్తుతానికి అత్యంత రహస్యంగా ఉంచారు. తండ్రి బెల్లంకొండ సురేష్ గతంలోనే తన కొడుకు పెళ్లి గురించి హింట్ ఇచ్చారు. కాబట్టి ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కావచ్చని సినీ వర్గాల సమాచారం. నిశ్చితార్థం ముగిసిన వెంటనే పెళ్లి తేదీ, వేదిక, వధువు వివరాలపై బెల్లంకొండ కుటుంబం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారి ప్రకటన చేయలేదు. కానీ ఈ వారమే ఈ యంగ్ హీరో నిశ్చితార్థం ఉండవచ్చని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

READ ALSO: Namakkal Egg Exports: కుప్పకూలిన గుడ్డు ధరలు.. రోజుకు రూ.5 కోట్ల నష్టం!