Reading Time: < 1 minute
New Express Trains Visakhapatnam Kollam Cherlapally Shalimar Schedules

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే వార్తను అందించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ రెండు నూతన ఎక్స్‌ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించనుంది. ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. కేవలం కనెక్టివిటీ పెంచడమే కాకుండా.. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ వీక్లీ రైళ్లను ప్రవేశపెట్టారు.

Also Read:Advance Tax Deadline: అడ్వాన్స్ టాక్స్ లాస్ట్ డేట్ మార్చి 15.. ఎవరు చెల్లించాలి? ఎంత చెల్లించాలి?

అందులో ఒకటి విశాఖపట్నం – కొల్లాం ఎక్స్‌ప్రెస్ (18501/18502). ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 8:20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2:50 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. మార్గమధ్యలో దువ్వాడ స్టేషన్‌కు ఉదయం 8:50 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం సాయంత్రం 5:20 గంటలకు కొల్లాంలో ప్రారంభమై.. గురువారం రాత్రి 11:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

మరొక ట్రైన్.. చర్లపల్లి – షాలిమార్ ఎక్స్‌ప్రెస్ (17065/17066). హైదరాబాద్ శివారులోని చర్లపల్లి నుంచి ఈ రైలు మంగళవారం ఉదయం 7:15 గంటలకు బయలుదేరి.. బుధవారం ఉదయం 11:20 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గంటలకు షాలిమార్‌లో బయలుదేరి.. గురువారం సాయంత్రం 7:00 గంటలకు తిరిగి చర్లపల్లికి చేరుకుంటుంది.

Also Read:Modi-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు మోడీ ఫోన్.. యుద్ధంపై సంభాషణ

నిర్వహణ కారణాల రీత్యా రాజమండ్రి, కాకినాడ పోర్ట్, విశాఖపట్నం మధ్య నడిచే కొన్ని రైళ్లను ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. ముఖ్యంగా ట్రైన్ నంబర్స్ 07524, 17267, 17268 , 07523 సర్వీసులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడానికి రైల్వే శాఖ ప్రత్యామ్నాయంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ-విజయవాడ-గుంటూరు మార్గాల్లో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. 16 చైర్ కార్ కోచ్‌లతో నడిచే ఈ రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. పండుగలు, సెలవుల సమయంలో ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ప్రయాణికులకు ఊరటనిస్తున్నాయి.