Reading Time: < 1 minute
Sharad Pawar Rajya Sabha Nomination Mva Support Supriya Sule Comments

Sharad Pawar: మహారాష్ట్ర నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎన్‌సిపి (ఎస్పీ) అధినేత శరద్ పవార్ నామినేట్ అయ్యారు. ఈ నిర్ణయానికి మహా వికాస్ అఘాడి (MVA) లోని అన్ని మిత్రపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ విషయాన్ని ఎంపీ సుప్రియా సూలే అధికారికంగా ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే, కెసి వేణుగోపాల్ వంటి అగ్రనేతలు శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారని తెలిపారు. దశాబ్దాలుగా పవార్‌తో కలిసి నడిచిన నాయకులందరూ ఇప్పుడు ఏకతాటిపైకి రావడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆమె ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు, త్వరలోనే సోనియా, రాహుల్ గాంధీలను కలిసి ధన్యవాదాలు తెలపనున్నట్లు పేర్కొన్నారు.

READ ALSO: AP Govt: ఎక్కువ మంది పిల్లలు కనే దంపతులకు రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు ప్రకటన..

పార్థ్ పవార్ ఎంట్రీపై క్లారిటీ..
అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ రాజ్యసభ నామినేషన్ గురించి వస్తున్న వార్తలపై సుప్రియ స్పందిస్తూ.. “కుటుంబం వేరు, పార్టీ వేరు. ఈ రెండింటినీ ఎప్పుడూ కలపకూడదు. ఎవరి స్థానం వారిదే” అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారన్న వార్తలపై ఆమె స్పందిస్తూ.. బీహార్‌లో నితీష్ పేరుతోనే ఎన్నికలు జరిగాయని, అక్కడ జరుగుతున్న మార్పులపై పూర్తి సమాచారం వచ్చాకే మాట్లాడతానని పేర్కొన్నారు. 2006లో తాను రాజ్యసభకు వెళ్ళినప్పుడు ఎన్నిక ఏకగ్రీవమైందని సుప్రియా సూలే గుర్తు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, అన్ని పార్టీలు సమన్వయంతో వ్యవహరిస్తే శరద్ పవార్ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. బాలాసాహెబ్ థాకరే లేకపోయినా, బీజేపీ సహా అన్ని పార్టీలు సానుకూల ధోరణితో వ్యవహరిస్తాయని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

READ ALSO: Thaman: మెగాస్టార్‌- బాబీ మూవీలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్!