Reading Time: 2 minutes
Pakistan Fuel Crisis 2026 Strait Of Hormuz Closure Impact

Pakistan: మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఇరాన్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధి మూసివేతతో ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. ఈ పరిణామం పాకిస్థాన్‌ను ఊపిరి ఆడనివ్వని ఇంధన సంక్షోభంలోకి నెట్టింది. ప్రపంచ ఇంధన అవసరాలలో 20 శాతం వాటా హోర్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. యుద్ధం కారణంగా ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచ దేశాలతో పాటు పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. నిజానికి ప్రస్తుతం దాయాది దేశం భయం గుప్పిట్లో ఉంది. ఎందుకంటే దేశంలో ఎప్పుడు చమురు సంక్షోభం ముదురుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొనడంతో, అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

READ ALSO: OnePlus 15T: 7500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ 50MP కెమెరాతో.. వన్ ప్లస్ 15టీ వచ్చేస్తోంది..

పాకిస్థాన్‌లో ఇంధన ఎమర్జెన్సీ..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇప్పటికే 15 శాతం పెరిగాయి. త్వరలోనే చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు దిగుమతులు నిలిచిపోవడంతో పాకిస్థాన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం రంగంలోకి దిగి, దేశంలో కఠిన నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఉద్యోగులను ఇళ్ల నుంచే పని చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. చమురు కంపెనీల లిక్విడిటీని కాపాడేందుకు ప్రతి వారం పెట్రోలియం ధరలను సవరించాలని నిర్ణయించింది. గల్ఫ్ దేశాల నుంచి సరఫరా నిలిచిపోవడంతో, పాకిస్థాన్ ఇప్పుడు రష్యా నుంచి దిగుమతులు పెంచుకోవడంపై దృష్టి సారించింది.

పాక్ వద్ద ఉన్న నిల్వలు ఎంతంటే..
తాజా నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ వద్ద ఉన్న చమురు నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి.

ముడి చమురు (Crude Oil): కేవలం 10 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి.

పెట్రోలియం ఉత్పత్తులు: సుమారు 28 రోజులకు సరిపడా ఉన్నాయి.

LPG (వంట గ్యాస్): కేవలం 15 రోజులు మాత్రమే వస్తుంది.

దిగుమతులపై దెబ్బ..
పాకిస్థాన్ ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, నైజీరియా వంటి దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. అయితే, హోర్ముజ్ మార్గం మూతపడటంతో ఈ సరఫరా గొలుసు పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాకిస్థాన్ కొత్త మార్గాల కోసం అన్వేషిస్తోంది.

READ ALSO: Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు కార్యక్రమానికి స్వస్తి?