Reading Time: < 1 minute
Hyderabad Tolichowki Building Collapse Four Dead Several Injured

Hyderabad: హైదరాబాద్ టోలీచౌకిలో విషాదం చోటు చేసుకుంది. ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ మృతదేహాలను వెలికి తీస్తోంది. ప్రస్తుతం సిబ్బంది శిథిలాలను తొలగిస్తోంది. పోలీసులు సైతం అక్కడికి చేరుకున్నారు. భవనం కూలిపోవడానికి గల కారణాలను గురించి దర్యాప్తు ప్రారంభించారు. ఐదు అంతస్తుల కొత్త భవనానికి ప్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగినప్పుడు పదిమంది తాపీ మేస్త్రీలు పనిచేస్తున్నట్టు సమాచారం. ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా భవన నిర్మాణాల పనిచేస్తున్నాడు యజమాని.

READ MORE: Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!