Reading Time: < 1 minute
Heat Waves In Telugu States

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. వేసవి ప్రారంభంలోనే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం నుంచే హీటెక్కిస్తున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. వేసవి కాలం ప్రారంభంలోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం నుంచే వేడిగాలులు కారణంగా ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు అయితే అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రస్తుతం 38 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరిన్ని రోజుల్లో తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Minister BC Janardhan Reddy: రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కీలక సమాచారం..

హైదరాబాద్‌లో వేసవి ప్రారంభంలో సూర్యుడు మండిపోతున్నాడు. రాత్రిపూట వాతావరణం చల్లగా ఉన్నా.. పగలు మాత్రం ఉదయం నుంచి ఉక్కపోత పోస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు లేకపోతే ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. అంతగా ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఇది కూడా చదవండి: Varalaxmi:అబ్బాయిల చెడ్డీ కనిపిస్తే ఓకే.. అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే తప్పా?