Reading Time: < 1 minute
Tollywood Heroines Career Struggles Due To Bollywood Interest Pooja Hegde Mrunal Thakur

టాలీవుడ్‌ను ‘గ్లామర్ ఇండస్ట్రీ’ అంటారు. ఇక్కడ ఒక్కసారి స్టార్‌డమ్ వస్తే కోట్లలో రెమ్యూనరేషన్, విపరీతమైన అభిమానం సొంతమవుతాయి. అయితే, మన సౌత్ హీరోయిన్లకు ఎప్పుడూ ఒక కోరిక ఉంటుంది.. అదే బాలీవుడ్ వెళ్లాలని! అక్కడ పాగా వేయాలనే మోజులో ఇక్కడ చేతిలో ఉన్న అద్భుతమైన అవకాశాలను వదులుకుని, చివరకు ఎటు కాకుండా పోయిన భామలు ఎందరో ఉన్నారు. ఇలియాన నుండి పూజా హెగ్డే.. వరకు ఇదే బాటలో సాగుతూ తమ కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేసుకుంటున్నారా? అన్న చర్చ మొదలైంది.

Also Read : Sonu Sood: రంగంలోకి హీరో సోనూసూద్.. దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!

అయితే ఒకప్పుడు టాలీవుడ్‌లో ‘గోల్డెన్ లెగ్’ అని పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే, వరుస ఫ్లాపులతో ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది. ‘రాధేశ్యామ్’ తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో క్రేజ్ తగ్గింది. పోనీ ఇక్కడ నిలబడదామా అంటే.. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ వంటి భారీ ప్రాజెక్టును వదులుకుని మరీ బాలీవుడ్ వైపు వెళ్లింది.ఇక మృణాల్ ఠాకూర్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి హిట్స్‌తో టాలీవుడ్ ఆడియన్స్ మనసు గెలుచుకున్న ఈ భామ, ‘ఫ్యామిలీ స్టార్’ ఫ్లాప్ అవ్వగానే ముంబై ఫ్లైట్ ఎక్కేసింది.

అక్కడ అక్షయ్ కుమార్ పక్కన ఛాన్స్ దక్కిందన్న ఆశతో టాలీవుడ్ సినిమాలకు నో చెబుతోందనే టాక్ వినిపిస్తోంది.గతం గమనిస్తే.. సౌత్ ఇండస్ట్రీని చిన్నచూపు చూసి బాలీవుడ్ వైపు వెళ్లిన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు వెండితెరపై కనిపించడమే మానేశారు. టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు బాలీవుడ్ డ్రీమ్స్ కోసం ఇక్కడి ఇండస్ట్రీకి సారీ చెప్పేసింది. తీరా అక్కడికి వెళ్ళాక ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు, ఇప్పుడు ఇక్కడ కూడా ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు.