Reading Time: < 1 minute
Varalaxmi Sarath Kumar Bold Interview Comments On Girls Dressing Viral

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతోనే కాదు, తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. అయితే తాజాగా వరలక్ష్మీ తన అప్ కమ్మింగ్ మూవీ ‘ఎస్.సరస్వతి’ సినిమాతో ఆమె డైరెక్టర్ గా మారారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అమ్మాయిల వస్త్రధారణపై సమాజం చేసే కామెంట్స్ గురించి కొన్ని ఘాటైన ప్రశ్నలు వేశారు.

Also Read :David Reddy: మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’లో రాశి ఖన్నా

‘అమ్మాయిలు ఏం వేసుకోవాలి అనేది వాళ్ల బాడీ.. వాళ్ల ఛాయిస్. అబ్బాయిల చెడ్డీ (Cheddy) కనిపిస్తే ఎవరికీ ప్రాబ్లం ఉండదు. కానీ ఒక అమ్మాయి ‘బ్రా స్ట్రాప్’ (Bra Strap) కనిపిస్తే ఎందుకు అంత రచ్చ చేస్తారు? అది కేవలం ఒక ఇన్నర్ వేర్ మాత్రమే కదా!’ అని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా, మగవారి ఆలోచనా విధానంపై స్పందిస్తూ.. ‘మన ఇంట్లో ఉండే అమ్మ, అక్కాచెల్లెళ్లను చూసినప్పుడు రాని చెడు ఆలోచనలు, బయట ఉన్న అమ్మాయిలను చూడగానే ఎందుకు వస్తున్నాయి?’ అంటూ సూటిగా ప్రశ్నించారు. వరలక్ష్మి చేసిన ఈ ‘రా అండ్ హానెస్ట్’ వ్యాఖ్యలపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు ఆమె బోల్డ్ స్టేట్‌మెంట్‌ను సమర్థిస్తుంటే, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా, వరలక్ష్మి శరత్ కుమార్ తన మాటలతో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.