Reading Time: < 1 minute
Nora Fatehi Comments On World Peace Middle East Crisis Trolls Reply

పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి సోషల్ మీడియా వేదికగా శాంతి సందేశాన్ని వినిపించారు. ‘నేను ఏ ఒక్క దేశాన్నీ ఉద్దేశించి ప్రస్తుత సంక్షోభం గురించి మాట్లాడటం లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసం, శాంతి కోసం మాట్లాడుతున్నాను’ అంటూ ఆమె ఒక వీడియోను పంచుకున్నారు.

Also Read: Shreya Ghoshal: సంచలన నిర్ణయం తీసుకున్న మరో స్టార్ సింగర్..

అయితే నోరా చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తూ విమర్శలు (Trolls) చేశారు. ఈ ట్రోల్స్‌పై నోరా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరో వీడియోతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. ‘ఐక్యత గురించి, శాంతి గురించి మాట్లాడితే కొందరికి ఎందుకు అంత కోపం వస్తుందో అర్థం కావడం లేదు. ఈ సోషల్ మీడియా యుగంలో చాలామందికి ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినే ఓపిక, అర్థం చేసుకునే సామర్థ్యం నశించినట్లు కనిపిస్తోంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమకాలీన సమస్యలపై స్పందిస్తూనే, మానవత్వం.. ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని నోరా కోరారు. కేవలం గ్లామర్ తారగానే కాకుండా, బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విమర్శలను ధీటుగా ఎదుర్కొన్న తీరును ఆమె అభిమానులు అభినందిస్తున్నారు.