Reading Time: < 1 minute
Telangana Assembly New Council Hall Telangana Thalli Inauguration March 8

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. అసెంబ్లీ ప్రాంగణ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా మార్చి 8వ తేదీన నూతనంగా నిర్మించిన కౌన్సిల్ హాల్‌ను ప్రారంభించనున్నారు. కౌన్సిల్ హాల్ ప్రారంభోత్సవం జరిగే అదే రోజున (మార్చి 8) అసెంబ్లీ ప్రాంగణంలో ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర అస్తిత్వానికి, గౌరవానికి చిహ్నంగా ఈ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు.

CM Nitish Kumar: రాజ్యసభకు సీఎం నితీష్ కుమార్.. బీహార్‌లో బీజేపీ మాస్టర్ ప్లాన్..?

నూతన కౌన్సిల్ హాల్‌తో పాటు, అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి (CM) ఛాంబర్‌ను , శాసనమండలి చైర్మన్ ఛాంబర్‌ను కూడా ప్రభుత్వం అదే రోజున ప్రారంభించనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, ఈసారి జరగబోయే బడ్జెట్ సమావేశాలను ఒకే ప్రాంగణంలోని అసెంబ్లీ , నూతన కౌన్సిల్ హాల్‌లలో నిర్వహించనున్నారు. ఉభయ సభల సమావేశాలు ఒకే ప్రాంగణంలో జరగడం వల్ల పాలనాపరమైన పనులు మరింత సులభతరం కానున్నాయి.

Ayatollah Ali Khamenei Funeral: ఖమేనీని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఎప్పుడు.. ఎక్కడ.. సమయం తెలుసుకోండి..