Reading Time: < 1 minute
Bengaluru Techie Suicide Software Engineer Ends Life After Domestic Dispute In Hsr Layout

Bengaluru: టెక్ సిటీ బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కేవలం వంట చేసే విషయంలో అత్తతో జరిగిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బీహార్‌కు చెందిన నితీష్ కుమార్ (31) బెంగళూరులోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ గా పనిచేస్తున్నారు. అతను తన భార్య, అత్తతో కలిసి నగరంలోని HSR లేఅవుట్ పరిధిలో నివసిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇంట్లో వంట చేసే విధానం, రుచికి సంబంధించి నితీష్‌కు, అతని అత్తకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?

సంఘటన జరిగిన రోజు కూడా భోజనం విషయంలో నితీష్, అతని అత్త మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన నితీష్, తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. ఎంతసేపటికీ అతను బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా.. నితీష్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Israel-Iran War: ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్.. గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటన

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమిక విచారణలో కేవలం వంట విషయంలో జరిగిన గొడవే ఈ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తెలుస్తోంది. నితీష్ మరణంపై అతని కుటుంబ సభ్యుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.