Reading Time: < 1 minute
Stock Market Indices Heavy Losses

దేశీయ మార్కెట్‌కు పశ్చిమాసియా యుద్ధ భయం పట్టుకుంది. గత మూడు రోజులుగా మార్కెట్‌ అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం తర్వాత మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత రెండు రోజులుగా లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. బుధవారం కూడా మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమై తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.

ప్రస్తుతం సెన్సెక్స్ 1750 పాయింట్లు నష్టపోయి 78, 549 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 532 పాయింట్లు నష్టపోయి 24, 332 దగ్గర కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాల మధ్య భారీ నష్టాల్లో సూచీలు ట్రేడ్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Arjun Tendulkar-Saaniya: గ్రాండ్‌గా అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుక.. వీడియోలు వైరల్