Reading Time: < 1 minute

HDFC బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక.. ఏటీఎం రూల్స్ మారబోతున్నాయ్ !

Caption of Image.

న్యూఢిల్లీ: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఏటీఎం క్యాష్​విత్​డ్రాయల్​చార్జీలను వచ్చే నెల నుంచి మార్చుతోంది. ఇప్పటి వరకు కార్డుతో డబ్బు తీసే విషయంలో మాత్రమే పరిమితులు ఉండేవి. ఇకపై కార్డుతో సంబంధం లేకుండా యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి నగదు తీసినా ఉచిత లావాదేవీల లెక్కలోకి వస్తాయి. బ్యాంక్ నిర్ణయించిన నెలవారీ ఐదు ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి విత్ డ్రాయల్ పై  రూ.23 వరకు చార్జీలు చెల్లించాలి.

సాధారణంగా మెట్రో నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో ఐదు వరకు ఉంటాయి. ఈ పరిమితిలో ఇకపై యూపీఐ నగదు ఉపసంహరణలను కూడా చేర్చింది.  ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.

©️ VIL Media Pvt Ltd.