Reading Time: < 1 minute

T20 World Cup: టీమిండియాపై చంద్రగ్రహణం ఎఫెక్ట్: ముంబైలో మారిన ప్రాక్టీస్ సెషన్ టైమింగ్

Caption of Image.

ముంబై: టీమిండియాపై చంద్రగ్రహణం ప్రభావం పడింది. 2026, మార్చి 3న శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడటంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ షెడ్యూల్‎ను బీసీసీఐ మార్చింది. మొదట ఖరారు చేసినషెడ్యూల్ ప్రకారం.. మంగళవారం (మార్చి 3) సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్‎లో పాల్గొనాల్సి ఉంది. 

కానీ సోమవారం (మార్చి 3) మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6:40 గంటల వరకు చంద్ర గ్రహణం ఏర్పడటంతో.. సాయంత్రం 6 గంటకు ప్రారంభం కావాల్సిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్ వాయిదా పడింది. గ్రహణం ముగిసిన తర్వాత టీమిండియా నెట్ సెషన్‎లో పాల్గొంది. గ్రహణ సమయంలో బయట తిరగకూడదు.. మంచి పనులు ప్రారంభించకూడదు అనే హిందూ ఆచారంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

►ALSO READ | T20 World Cup: ఇంగ్లాండ్‌ను ఓడిస్తే క‌ప్పు టీమిండియాదే.. ఎలాగో తెలుసా?

ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు దీనిని సమర్ధిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంగ్లాండ్‎తో సెమీస్ పోరు కోసం గ్రహణ సమయంలో ప్రాక్టీస్ సెషన్ మొదలు పెట్టకపోవడమే మంచిదని కొందరు అంటుండగా.. క్రీడల్లో ఆచారాలు ఏంటని మరికొందరు పెదవి విరుస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. 

©️ VIL Media Pvt Ltd.