Reading Time: < 1 minute
Shimron Hetmyer Creates Six Hitting Record In T20 World Cup Despite West Indies Defeat

Shimron Hetmyer: క్రికెట్ లో రికార్డ్స్ కొత్తగా సృష్టించడం.. వాటిని మరొకరు బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించడం మాములే. ఇందులో భాగంగానే భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన సూపర్-8 చివరి మ్యాచ్‌ లో కరీబియన్ బ్యాటర్ హిట్ మేయర్ అరుదైన ఘనత సాధించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా, కేవలం రెండు సిక్సర్లతో ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. రోస్టన్ చేజ్, కెప్టెన్ షై హోప్ జట్టు‌కు మంచి ఆరంభం ఇచ్చారు. మొదటి వికెట్ పడిన తర్వాత క్రీజ్‌ లోకి వచ్చిన ఎడమచేతి బ్యాటర్ హిట్ మేయర్ ఈ వరల్డ్ కప్‌ లో కొనసాగిస్తున్న ఫామ్‌ను మరోసారి టీమిండియా బౌలర్లకు రుచి చూపించాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ లో అతను మొదటి సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ లో మరో భారీ సిక్స్ బాదడంతో ఒకే వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఏకంగా 19 సిక్సర్లను సాధించాడు.

Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

ఈ రికార్డు ముందుగా పాకిస్థాన్ ఓపెనర్ సాహిబీజాడా ఫర్హాన్ (18 సిక్సర్లు) పేరిట ఉండేది. అతను వెస్టిండీస్ మాజీ స్టార్ నికోలస్ పూరన్ 2024లో సాధించిన 17 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు సిక్సర్ల ఆ రికార్డులను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో అతను ఇన్నింగ్స్ ఎక్కువ సేపు ఆడలేకపోయాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కేవలం 12 బంతుల్లోనే 27 పరుగులు (2 సిక్సర్లు, 1 ఫోర్) చేసి పేవిలియన్ చేరాడు. అదే ఓవర్‌లో రోస్టన్ చేజ్ (40)ను కూడా ఔట్ చేసి వెస్టిండీస్‌కు భారీ షాక్ ఇచ్చాడు. దీంతో భారత జట్టు మ్యాచ్‌పై పట్టు సాధించింది. మొత్తంగా సంజూ అద్భుత బ్యాటింగ్ తో టీమిండియాను సెమిస్ కు చేర్చాడు.