Reading Time: < 1 minute
వార్నీ.. ఇదేం మంచంరా సామీ.. దీని స్పెషల్ ఏంటో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు.. మాది గ్యారెంటీ..!

సాధారణంగా పట్టణ వాసులకు నులక మంచాలు అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి తప్పక పరిచయం ఉండే ఉంటాయి. అయితే, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ప్రస్తుతం పట్టణాలలో కూడా వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా నులక మంచం చాలా పెద్దదిగా ఉంటుంది. ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చుంటారు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న నులక మంచం లాంటిది మీరు ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. ఈ మంచం చాలా చిన్నది. దానిపై ఒక్కరు మాత్రమే కూర్చోవచ్చు. వినియోగదారులు ఈ నులక మంచంపై ఫన్నీ కామెంట్స్‌తో స్పందిస్తున్నారు.

వైరల్ వీడియోలో 2 అడుగుల పొడవైన నులక మంచం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ మంచం వైపు చూడగానే ముందుగా గుర్తుకు వచ్చే ప్రశ్న దీని సృష్టికర్త ఏం ఆలోచించి తయారు చేశాడని. ఈ మంచంపై పడుకుని నిద్రించడానికి గానీ, ఒకరి కంటే ఎక్కువ మంది కూర్చోవడానికి కూడా తగినది కాదు. కాబట్టి, దాని ఉద్దేశ్యం ఏమిటి? ఇంతకీ ఈ వీడియో ఎవరిది..?

వీడియో తీస్తున్న వ్యక్తి ఆ మంచం చూపించి, దానిని ప్రపంచంలోనే అతి చిన్న మంచం అని వర్ణించాడు. ఆ తర్వాత అది ఒక వృద్ధుడి మంచం అని వివరించాడు. ఈ వీడియో ప్రత్యేకమైనది. ఫన్నీగా ఉంది. ముందుగా వీడియో చూసి, దానికి వినియోగదారులు ఎలా స్పందించారో చూద్దాం.

ఆ వీడియోను ఎవరు పోస్ట్ చేసారు? ఈ వైరల్ వీడియోను @ameer_ansari_up12 అనే ఖాతా ద్వారా Instagramలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 11,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. వందలాది మంది వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.

 

View this post on Instagram

 

A post shared by Azam Ansari (@ameer_ansari_up12)

వినియోగదారుల అభిప్రాయం ఏంటంటే..వీడియో చూసిన తర్వాత చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేశారు. ఒక వినియోగదారుడు, “మా అమ్మమ్మ చిన్నప్పుడు మా కోసం దీన్ని తయారు చేసేది అని ఒకరు. దీనిని ఖటోలా అంటారని మరొకరు రాశారు. ఒక వినియోగదారుడు సరదాగా స్పందిస్తూ..దానిపై పడుకున్న వ్యక్తిని కూడా చూపించు అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..