Reading Time: < 1 minute
Dont Know How Long I Will Be Around Trump After Mar A Lago Firing

తాను ఎంత కాలం ఉంటానో తెలియదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలోని నివాసంలోకి సాయుధ చొరబాటుదారుడు ప్రవేశంపై మాట్లాడారు. అనుమానితుడు తుపాకీ, ఇంధన డబ్బాను తీసుకుని మార్-ఎ-లాగోలోకి అక్రమంగా ప్రవేశించాడని తెలిపారు. చొరబాటుదారుడిని భద్రతా దళాలు కాల్చి చంపాయని పేర్కొన్నారు. షూటర్లు సాధారణ అధ్యక్షుల జోలికి వెళ్లరని.. కేవలం అసాధారణ విజయాలు సాధించే అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్‌, జాన్‌ ఎఫ్‌. కెన్నడీ హత్యలే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా.. తాను తీసుకునే నిర్ణయాలపై ఏ మాత్రం వెనక్కి తగ్గబోనన్నారు.

ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: కామన్వెల్త్ క్రీడల్లో గడ్కరీ ఏం చేశారో తెలియదా? బీజేపీపై మల్లిఖార్జున్ ఖర్గే విమర్శలు

ఇక ఎన్‌కౌంటర్ సమయంలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ధృవీకరించింది. FBI, సీక్రెట్ సర్వీస్, స్థానిక అధికారులు అనుమానితుడి నేపథ్యం, ఉద్దేశంపై దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడు 20 ఏళ్ల కుర్రాడిగా గుర్తించారు. తుపాకీ, ఇంధన డబ్బాను తీసుకుని వచ్చాడు. ఆ సమయంలో ఎస్టేట్‌లో ట్రంప్ గానీ… ఆయన భార్యగానీ లేరు. ట్రంప్‌పై గతంలోనూ పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. 2024 జులైలో ఎన్నికల ప్రచారంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ట్రంప్‌ చెవి భాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది.