Reading Time: < 1 minute

తేజస్‌‌కు మరో ప్రమాదం..30 జెట్లను పక్కన పెట్టిన ఐఏఎఫ్

Caption of Image.

న్యూఢిల్లీ: బోర్డర్​సమీపంలోని భారత వాయుసేన ఎయిర్‌‌బేస్‌‌లో స్వదేశీ యుద్ధవిమానం ఎల్‌‌సీఏ తేజస్ మరోసారి ప్రమాదానికి గురైంది. ట్రైనింగ్ సెషన్ పూర్తి చేసుకుని బేస్‌‌కు తిరిగి వస్తుండగా రన్‌‌వేపై అదుపు తప్పింది. బ్రేకింగ్ వ్యవస్థలో సమస్య కారణంగా విమానం దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. పైలట్ సురక్షితంగా ఎజెక్ట్ అయి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 

ఇది ఈ నెల 7వ తేదీని చోటుచేసుకుంది. ఇది తేజస్‌‌కు సంబంధించిన మూడో ప్రమాదం. 2024లో జైసల్మేర్ బేస్ వద్ద మొదటి ప్రమాదం జరిగింది, అప్పట్లో కూడా పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఐఏఎఫ్ వైపు నుంచి ఈ ఘటనపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

తాజా ప్రమాదం నేపథ్యంలో భారత వాయుసేన (ఐఏఎఫ్) ముందుజాగ్రత్త చర్యగా దాదాపు 30 సింగిల్ -సీట్ తేజస్ ఫైటర్ జెట్‌‌ల ఫ్లీట్‌‌ను పూర్తిగా గ్రౌండ్ చేసింది. దుబాయ్ ఎయిర్‌‌షోలో గతేడాది నవంబర్‌‌లో జరిగిన క్రాష్ లాంటి ప్రమాదాలను నివారించడమే ఈ నిర్ణయానికి కారణమని సమాచారం.

©️ VIL Media Pvt Ltd.