Reading Time: < 1 minute

హైదరాబాద్: గతంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చెప్పిన మాటాలతోనే తనలో చాలా మార్పు వచ్చిందని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలిపారు. సినిమా పాత్ర కోసం సన్నగా మారాల్సి వస్తే మారాలని అక్షయ్ సూచించారన్నారు. వేల మంది ట్రోల్ చేసిన పట్టించుకోవద్దన్నారు. తనకు ఇంకా పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని, శరీర బరువు కోసం తనని ట్రోలింగ్ చేయడంతో తనపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. శరీరాకృతి విషయంలో తన ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదని, ఏడుస్తూ నిద్రపోయిన రోజులు చాలా ఉన్నాయని, మార్నాడు ఉబ్బిన కళ్లతో మేల్కొన్న రోజులు కూడా చాలానే ఉన్నాయన్నారు. వాటిని పట్టించుకోవడం మానేసిన తరువాతనే తాను ముందుకు వెళ్తున్నానని చెప్పారు. ‘ఒక రోజు నేను జిమ్ కు వెళ్లినప్పుడు ఒక అమ్మాయి నా వద్దకు వచ్చి నేను మీలా మారాలంటే నేను ఏం చేయాలని నన్ను అడిగింది’ అని గుర్తు చేశారు. మనం ఎలా ఉన్నా నచ్చేవాళ్లకు నచ్చుతామని, మనం మనల్ని గౌరవించుకుంటే ఇతరులు మనని గౌరవిస్తారని మృణాలు తెలియజేశారు.