Reading Time: 2 minutes
వారణాసిపై పృథ్వీరాజ్ కామెంట్స్‌.. టైమ్ ట్రావెల్ మూవీ కాదు.. అంతకు మించి ఉంటుందట

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ  వారణాసి. ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దాంతో అభిమానులు ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. సినిమాలో కీలకమైన నెగిటివ్ రోల్‌లో కనిపించనున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన మాట్లాడుతూ.. ‘వారణాసి’ కేవలం ఒక సాధారణ టైమ్ ట్రావెల్ కథ కాదని పృథ్వీరాజ్ చెప్పడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. “ఇది కేవలం టైమ్ ట్రావెల్ స్టోరీ కాదు. అంతకుమించిన స్థాయిలో కథ ఉంటుంది. డిఫరెంట్ టైమ్ ట్రావెల్స్ మధ్య ఈ కథ సాగుతుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

అంతేకాదు.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రాలతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. దీంతో సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది.? మహేశ్‌తో ఆయనకు ఎలాంటి యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి ? అనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. ఇదిలా ఉంటే వారణాసి సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక మిగిలిన షూటింగ్‌ను కూడా మరో మూడు వారాల్లో పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన వెంటనే సినిమా ప్రమోషన్స్‌ను గ్లోబల్ రేంజ్‌లో ప్రారంభించే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ పలు విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్‌ను కూడా రాజమౌళి తనదైన స్టైల్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే వారణాసి సినిమాను సింగిల్ పార్ట్ గానే తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ప్రపంచం మొత్తం మారుమ్రోగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.