Reading Time: < 1 minute

ఇండోనేసియాలో నౌక బోల్తా.. ఆరుగురు మృతి, 130 మంది గల్లంతు

Caption of Image.

జకార్తా: ఇండోనేసియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ‘వర్గో ట్రాన్స్‌‌‌‌పోర్ట్ 8’ నౌక బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 130 మంది గల్లంతయ్యారు. జావా ద్వీపంలోని సురబాయా నుంచి శనివారం బోర్నియోలోని బంజర్మాసిన్ నగరానికి బయలుదేరిన ఈ నౌకలో 213 మంది ప్రయాణికులు, 30 మంది సిబ్బంది ఉన్నారు. 

ఆదివారం తెల్లవారుజామున ఆపరేటర్‌‌‌‌తో నౌక సంబంధాలు కోల్పోయింది. తీవ్రమైన ప్రతికూల వాతావరణం మధ్య సుమారు 2.5 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న అలల కారణంగా నౌక బోల్తా పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే రక్షణ నౌకలు, ఒక హెలికాప్టర్‌‌‌‌తో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 107 మందిని రక్షించారు. అలల ఉధృతి గాలింపు చర్యలకు సవాలుగా మారిందని అధికారులు వెల్లడించారు. 

©️ VIL Media Pvt Ltd.