
వినాయకచవితి వచ్చిదంటే చాలు.. ప్రతి వీధిలో గణపయ్యల ప్రతిష్ఠలు.. ప్రతి గల్లీలో గణనాథుడి పాటలు.. భజనలు.. సిటీల్లో చౌరస్తాల్లో.. ప్రతి అపార్ట్ మెంట్ కి వినాయక మండపం.. భారీ సెట్టింగ్లు.. ఆ సందడే వేరు. ఇక నిమజ్జనం రోజు పిల్లల నుంచి పెద్దల వరకు ఆట పాటల్లో మునిగి తేలుతుంటారు. సాధరణంగా వినాయకుడి పూజలో పాలవెల్లిని ఉంచుతారు. పూజ అయిన తరువాత గుంజీలు తీస్తారు. ఇలా చేయడానికి కారణం ఏమిటి.. పండితులు ఏం చెబుతున్నారు. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. .!
వినాయకచవితి అంటే ఇవి మాత్రమే కాదు.. తొమ్మిది రోజుల పాటు భక్తిపారవత్వంతో అభిషేకాలు చేయాలి వ్రతం ఆచరించాలి. వినాయకుడి మహిమ గురించి తెలిపే కథలు చదవాలి. ఆయన నామాన్ని జపించాలి ఇంకెన్నో… ఉంటాయి.ఒక్క వినాయకుడి విగ్రహంలోనే లోకమంతా కనిపిస్తుంది. అందుకే వినాయ కుడిని కొలిస్తే విశ్వాన్ని కొలిచినట్లే.
- చిన్న ఎలుకపై వినాయకుడు ఉండటం పరిపూర్ణ మైన ఈ విశ్వానికి గుర్తు.
- ఏనుగు తల, సన్నని కళ్లు మేధస్సుకు సంకేతాలు.
- నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్వానికి ప్రతి రూపాలు
- చేతిలో ఉండే పాశ, అంకుశాలు బుద్ది, మనసులను మంచి మార్గంలో నడిపించే సాధనాలు
- మొత్తంగా వినాయకుడి విగ్రహమే మనం చేయాల్సిన కృషికి సంకేతం.
పూజతో ప్రశాంతత..
వినా యకుడి పూజ చేయడమంటేనే ధ్యానం చేయడం. ఒక క్రమపద్ధతిలో పూజలు చేయడం ఏకాగ్రతను పెంచుతుంది. దీనివల్ల జీవితంలో సమస్యలను ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుంది.
ఔషధగుణాలున్న పత్రాలతో…
ప్రకృతిలో దొరికే పత్రితో పూజించడం వల్ల వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. దీంతో పాటు పూజ చేసిన వాళ్ల ఆరోగ్యానికి మేలు కూడా. గణపతిని పూజించే 21 రకాల పత్రాల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఔషధ గుణాలు కళ్లు, చర్మం, మూత్ర సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. ఆకులను చేతితో ముట్టుకోవడం, వాటి వాసన పీల్చడం వలర శ్వాశ సమస్యలు దూరమవుతాయి. గణపతికి ప్రీతి పాత్రమైన గరికలో కూడా ఔషధ గుణాలున్నాయి.
పాలవెల్లి
వినాయకుడే విశ్వం అని చెప్పేందుకు పాలవెల్లి ఓ ఉదాహరణ. భూమి, సూర్యుడు.. గ్రహాలు ఇలా సౌరకుటుంబం అంతా పాలవెల్లి అనే ఖగోళ ప్రదేశంలో ఉంది. అందుకే వినాయకచవితి రోజు విగ్రహంపైన దీర్ఘ చతుర స్రాకార చట్రంలో పాలవెల్లిని పెడతారు.
21 సార్లు గుంజీల రహస్యం…
పూజలో విగ్రహం దగ్గర పుస్తకాలు పెట్టి, గుంజీలు తీస్తాం. ఇదంతా కూడా జ్ఞానానికి ప్రతీక చేతులతో చెవులు పట్టుకుని 21 సార్లు గుంజీలు తీయడంతో జ్ఞానం పెరుగుతుంది. ఇలా ఆ పూజ వెనకున్న రహస్యాన్ని అర్ధం చేసుకున్నవాళ్లకి కచ్చితంగా ముక్తిని ప్రసాది స్తాడు దేవదేవుడు. అందుకే వినాయకచవితినాడు వినాయకుడ్ని పూజించడం.. పాలవెల్లి అమర్చడం.. గుంజీలు తీయడంలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదేనని పండితులు చెబుతున్నారు.